‘ఉచిత బియ్యం ఇవ్వడం లేదు’

ABN , First Publish Date - 2022-12-31T23:49:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని వాడాడ పంచాయతీలో సుమారు 50 కుటుంబాలకు పంపిణీ చేయడం లేదని సర్పంచ్‌ సుంకాన సురేష్‌ అన్నారు.

‘ఉచిత బియ్యం ఇవ్వడం లేదు’

గార: కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని వాడాడ పంచాయతీలో సుమారు 50 కుటుంబాలకు పంపిణీ చేయడం లేదని సర్పంచ్‌ సుంకాన సురేష్‌ అన్నారు. శనివారం గారలో ఎంపీపీ గొండు రఘురాం అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ధాన్యం విక్రయాల నిబంధనల సడలింపు, విద్యుత్‌, వైద్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. జడ్పీటీసీ సభ్యురాలు సుజాత, ఎంపీడీవో రామమోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:49:53+05:30 IST

Read more