హక్కుల ఉల్లంఘన జరగకూడదు: జేసీ

ABN , First Publish Date - 2022-12-09T23:37:31+05:30 IST

సమాజంలో పౌర హక్కుల ఉల్లంఘన జరగకూడదని జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ హాల్‌లో కేంద్రమానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

హక్కుల ఉల్లంఘన జరగకూడదు: జేసీ
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

శ్రీకాకుళం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమాజంలో పౌర హక్కుల ఉల్లంఘన జరగకూడదని జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ హాల్‌లో కేంద్రమానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ప్రతి పౌరునికీ కల్పించాల్సిందేనని చెప్పారు. హ క్కుల ఉల్లంఘన జరగకుండా పలు చట్టాలున్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు జేసీ అందజేశారు. ప్రిన్సిపాల్‌ సురేఖ, కేంద్ర మానవ హక్కుల సంఘం రాష్ట్ర సమ న్వయకర్త దుర్గాప్రసాద్‌, రాష్ట్ర అధ్యక్షుడు బి.నర్సింగరావు, సామాజిక కార్యకర్త నటుకుల మోహన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

అసమానతలు తొలగిపోవాలి

అరసవల్లి: మహిళలపై అసమానతలు తొలగిపోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల ఎదుగుదలకు ఎటువంటి సమస్యలు ఉండరాదని, వారితో మంచిగా ప్రవర్తించాలని తెలిపా రు. అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై మహిళలు ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ చేపట్టి శిక్ష విధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు జి.సీతారాం మాట్లాడుతూ.. మహిళా హక్కులను అందరం కాపాడుకోవాలని చెప్పారు. దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ అనంతలక్ష్మి, సీడబ్ల్యూ అధ్యక్షులు శ్రీలక్ష్మి, లక్ష్మికుమారి, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టాలి

ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించా రు. శ్రీకాకుళం రూరల్‌ మండలం నైరలోని ఓ రైస్‌ మిల్లు ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. రైతుభరోసా కేంద్రాల నుంచి సేక రించిన 800 క్వింటాళ్ల ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం ఎక్కడ నుంచి వచ్చింది, వివరాల అప్‌లోడ్‌, తదితర వివరా లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి డీవీ రమణ, జిల్లా మేనేజర్‌ పి.జయంతి, తహసీల్దార్‌ కె.వెంకటరావు, ఉప తహసీల్దార్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:37:32+05:30 IST