ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T23:25:17+05:30 IST
దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్ట పురుషోత్తం డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలి పారు.
టెక్కలి: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్ట పురుషోత్తం డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేస్తున్న వారిని వైసీపీ నాయకులు కాపాడుతూ దళిత ద్రోహు లుగా మిగిలిపోతు న్నారని ఆరోపించారు. దళితులకు సంబంధిం చిన 18 పథకాలను రద్దుచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వా నికే దక్కిందన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేం దుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిం చగా ఎస్ఐ రామకృష్ణ అడ్డుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, నేతలు రెయ్యి ప్రీతీష్, హనుమంతు రామకృష్ణ, కామేసు, పేర మురళి, దల్లి ప్రసాద్‌రెడ్డి, మామిడి రాము, లవకుమార్, మెండ దమయంతి, తోట రాజశేఖర్, మురళి, అప్పలస్వామి, బగాది సునీల్ తదితరులు పాల్గొన్నారు.