యువతలో క్రీడాస్ఫూర్తిని కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-24T04:04:36+05:30 IST

యువతలో క్రీడాస్ఫూర్తిని కల్పించడమే లక్ష్యంగా జగనన్న క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించామని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

యువతలో క్రీడాస్ఫూర్తిని కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే
విన్నర్స్‌కు రూ.లక్ష చెక్‌, కప్‌ అందిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

జగనన్న క్రికెట్‌ విన్నర్‌ అనస్పెక్ట్‌డ్‌ లెవెన్స్‌, రన్నర్‌ రైజింగ్‌ స్టార్‌

రూ.2 లక్షల బహుమతుల అందజేత

కావలిటౌన్‌, జనవరి 23: యువతలో క్రీడాస్ఫూర్తిని కల్పించడమే లక్ష్యంగా జగనన్న క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించామని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జడ్పీ పాఠశాల క్రీడామైదానంలో రెండు వారాల నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఫైనల్‌ పోటీతో జరిగింది. ఫైనల్స్‌లో అనస్పెక్ట్‌డ్‌ లెవెన్స్‌ కావలి జట్టు కావలికే చెందిన రైజింగ్‌ స్టార్‌ జట్టుపై విజయం సాధించి విన్నర్‌గా నిలవగా రైజింగ్‌ స్టార్‌ రన్నర్‌గా నిలిచింది. ఉదయం జరిగిన లూజింగ్‌ సెమీఫైనల్స్‌లో బిట్రగుంటకు చెందిన క్రికెట్‌ లవర్స్‌ ఇన్‌స్పైర్‌ వారియర్స్‌పై విజయం సాధించి తృతీయ స్థానంలో నలిచింది. విన్నర్‌కు రూ.1 లక్ష, రన్నర్‌కు రూ.50వేలు, తృతీయ స్థానంకు రూ.30వేలు, మ్యాన్‌ఆఫ్‌ది టోర్నమెంట్‌కు రూ.10వేలు నగదు బహుమతులు, ట్రోఫీలు అందించారు. పోటీల నిర్వాహకులు ఈతముక్కల చంద్రశేఖర్‌రెడ్డి, మన్నెమాల ఽఽధీరజ్‌ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిఽథిదిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇదే స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహణకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్సీ డీ.ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, సీఐ ఖాజావలి, నేతలు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, ఈతముక్కల బాలమురళీరెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి, కుందుర్తి కామయ్య, కనమర్లపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:04:36+05:30 IST