విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-12-07T23:44:17+05:30 IST

స్థానిక మహా త్మాగాంధీ షాపింగ్‌ కాం ప్లెక్స్‌ సమీపంలో బుధవా రం సాయంత్రం ఉన్నత పాఠశాల విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓవ్యక్తిని స్థానికులు పట్టు కొని దేహశుద్ధి చేశారు. పాఠశాల విడిచిపెట్టిన తరువాత దూరప్రాంతాల కు చెందిన విద్యార్థినులు వ్యాన్‌ ఎక్కేందుకు వెళ్తుం డగా ఓ వ్యక్తి తప్పతాగి వచ్చి వారితో అసభ్యకరం గా వ్యవహరించాడు.

 విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేస్తున్న దృశ్యం

పలాస: స్థానిక మహా త్మాగాంధీ షాపింగ్‌ కాం ప్లెక్స్‌ సమీపంలో బుధవా రం సాయంత్రం ఉన్నత పాఠశాల విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓవ్యక్తిని స్థానికులు పట్టు కొని దేహశుద్ధి చేశారు. పాఠశాల విడిచిపెట్టిన తరువాత దూరప్రాంతాల కు చెందిన విద్యార్థినులు వ్యాన్‌ ఎక్కేందుకు వెళ్తుం డగా ఓ వ్యక్తి తప్పతాగి వచ్చి వారితో అసభ్యకరం గా వ్యవహరించాడు. దీంతో విద్యార్థినులు రోధిస్తుండడంతో స్థానికంగా ఉన్న ఆటో కార్మికులు వచ్చి విషయం తెలుసుకున్నారు. సదరు వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి పంపించేశారు. ఇదిలా ఉండగా హైస్కూల్‌ విడిచిపెట్టే సమయంలో యువకులు ఈ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వారపుసంత (శుక్రవారం)రోజున కూడా రద్దీ వల్ల విద్యార్థినులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పోలీసులు దృష్టి సారించి పాఠశాల విడిచిపెట్టే సమయంలో నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-07T23:44:19+05:30 IST