క్షేమంగా ఇంటికి చేరిన వైద్య విద్యార్థి

ABN , First Publish Date - 2022-03-06T05:19:42+05:30 IST

వంజంగి గ్రామానికి చెందిన వైద్యవిద్యార్థి అన్నెపు వరప్రసాద్‌ శనివారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

క్షేమంగా ఇంటికి చేరిన వైద్య విద్యార్థి
తల్లిదండ్రులతో వరప్రసాద్‌:ఆమదాలవలస రూరల్‌: వంజంగి గ్రామానికి చెందిన వైద్యవిద్యార్థి అన్నెపు వరప్రసాద్‌ శనివారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. వరప్రసాద్‌ ఉక్రెయిన్‌లో  ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో  అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కు కున్న భారతీయులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంది. మూడురోజుల కిందట ఉక్రెయిన్‌ నుంచి పోలెండ్‌ సరిహద్దుకు వరప్రసాద్‌ చేరుకున్నాడు. అక్కడ మకాం వేసిన భారత ఎంబీసీ అధికారులు ప్రత్యేక విమా నంలో ఢిల్లీ శుక్రవారం చేర్చారు. అక్కడి నుంచి శనివారం రాత్రి  7.30 విశాఖ విమానా శ్రయానికి చేరుకున్నాడు. తమ కుమారుడు వరప్రసాద్‌ ఉక్రెయిన్‌ నుంచి స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కృషిచేసిన రెవెన్యూ సిబ్బందికి  తల్లిదండ్రులు సూర్యనారాయణ, సుజాత  అభినందనలు తెలిపారు.


 

Read more