ఘనంగా సామూహిక పూజలు

ABN , First Publish Date - 2022-09-09T04:44:00+05:30 IST

నందిగాం కారిగుడ్డి వీధిలో వినాయక మం డపం వద్ద గురువారం సామూహిక గణపతి సహస్ర నామా ర్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురోహి తులు ఎం.రమేష్‌శర్మ పర్యవేక్షణలో 50మంది మహిళలతో సామూహిక పూజలు నిర్వహించారు.

ఘనంగా సామూహిక  పూజలు
నందిగాం: కారిగుడ్డి వీధిలో సామూహిక పూజలు చేస్తున్న మహిళలు

నందిగాం: నందిగాం కారిగుడ్డి వీధిలో వినాయక మం డపం వద్ద గురువారం సామూహిక గణపతి సహస్ర నామార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురోహి తులు ఎం.రమేష్‌శర్మ పర్యవేక్షణలో 50మంది మహిళలతో సామూహిక పూజలు నిర్వహించారు. అలాగే హోమం చేశారు. వజ్జీలపేట, నందిగాం బజారువీధి, నౌగాం తదితర గ్రామాల్లో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. నౌగాంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, తూలుగు మహేష్‌, మదన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


131 కేజీ లడ్డూ ప్రసాదం 

జలుమూరు: శ్రీముఖలింగం మార్కెట్‌ వీధిలో కొలువు తీరిన గణేశునికి అదే గ్రామానికి చెందిన నందినిపాడి భక్తుడు 131 కేజీల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించాడు. ఈ లడ్డూ ప్రసాదానికి పూజలు చేసి వినాయకుని నిమజ్జనం రోజున వేలంపాట వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.


గణపతి హోమం 

ఎల్‌.ఎన్‌.పేట: లక్ష్మీనర్సుపేట జంక్షన్‌లో గురువారం గణనాథుని మండపం లో గణపతి హోమా న్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా విశేష పూజలు చేశారు.  వి.చంద్ర శేఖరరాజు, పాండురాజు, శ్రీనివాస రాజు పాల్గొన్నారు. 


108 పిండి వంటలతో...

నరసన్నపేట: లచ్చుమన్నపేటలో గురువారం గణేశునికి 108 రకాల పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ సం దర్భంగా విశేష అర్చనలు చేయగా భక్తులు దర్శించుకున్నారు. 


దీపారాధనతో శోభాయమానం

 టెక్కలి రూరల్‌: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా స్థానిక రోటరీ నగర్‌-1లో గురువారం రాత్రి దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొ ని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా దీపాల వెలుగులో వినాయక మండపం శోభాయ మానంగా కనిపించింది.

 

Read more