డిసెంబరు నెలాఖరుకు కిడ్నీ పరిశోధన కేంద్రం

ABN , First Publish Date - 2022-10-08T04:54:16+05:30 IST

పలాసలో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీకృష్ణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై అధికారులను ప్రశ్నించారు.

డిసెంబరు నెలాఖరుకు కిడ్నీ పరిశోధన కేంద్రం
ప్రభుత్వాసుపత్రిలో అధికారులతో మాట్లాడుతున్న ఎండీ మురళీకృష్ణ

- త్వరగా పనులు పూర్తిచేయండి
- ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీకృష్ణ ఆదేశం
పలాస, అక్టోబరు 7:
పలాసలో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీకృష్ణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఫ్లోరింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. దీనిపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డబ్బీరు భవానీ శంకర్‌ మాట్లాడుతూ... కొత్త భవనాలు నిర్మాణం వల్ల పాతభవనాలు దెబ్బతిన్నాయని, విద్యుత్‌, డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయిందన్నారు. వర్షం పడితే కారిపోతున్నాయని తెలిపారు. తక్షణమే వాటిని సరిచేయాలని ఎండీ ఆదేశించారు. అంతకు ముందు కిడ్నీ పరిశోధన కేంద్రం పరిశీలించి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి విద్యుత్‌, కాలువలు, జనరేటర్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఈ శివరామ్‌, ఈఈ ప్రసాద్‌, డీఈఈ అరుణ్‌కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-10-08T04:54:16+05:30 IST