ఉమ్మడి చాంపియన్లగా కేశవరావుపేట, పలాస

ABN , First Publish Date - 2022-12-30T00:11:19+05:30 IST

స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో బాలుర విజేతలను గురు వారం ప్రకటించారు. గేమ్స్‌ చాంపియన్‌ షిప్‌ను చెరో 20 పాయింట్లతో కేశవరావుపేట, పలాస పాఠశాలల జట్లు కైవశం చేసుకున్నాయి.

ఉమ్మడి చాంపియన్లగా కేశవరావుపేట, పలాస
పాఠశాలల తరఫున గేమ్స్‌ ఛాంపియన్‌షిప్‌ను అందుకుంటున్న పలాస, కేశవరావుపేట వ్యాయామ ఉపాధ్యాయులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో బాలుర విజేతలను గురు వారం ప్రకటించారు. గేమ్స్‌ చాంపియన్‌ షిప్‌ను చెరో 20 పాయింట్లతో కేశవరావుపేట, పలాస పాఠశాలల జట్లు కైవశం చేసుకున్నాయి. బాల్‌బ్యాడ్మింటన్‌, సాఫ్ట్‌ బాల్‌లో కేశవ రావుపేట, ఖోఖో, టెన్నికాయిట్‌లో పలాస క్రీడాకారులు విజేతలుగా నిలిచా రు. కబడ్డీలో కోటబొమ్మాళి, వాలీబాల్‌లో ఎల్‌ఎన్‌పేట, బ్యాడ్మింటన్‌లో మెళియాపుట్టి, ఫుట్‌బాల్‌లో బలగ, బాస్కెల్‌బాల్‌లో శ్రీకాకుళం ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ఎస్‌ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు.

జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలకు బైరాగి

ఎచ్చెర్ల: వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల) విద్యార్థి పరిగి బైరాగి జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికయ్యాడు. ఈసీఈ నాలుగో సం వత్సరం చదువుతున్న బైరాగి విజయవాడలో ఏపీ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. దీంతో జనవరి 12 నుంచి 16 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బైరాగిని వెంకటేశ్వర విద్యా సంస్థల డైరెక్టర్‌ బుడు మూరు శ్రీరామ్మూర్తి, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌సీవీ రామ్మూర్తినాయుడు అభినందించారు.

Updated Date - 2022-12-30T00:11:19+05:30 IST

Read more