కావ్యకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-12-15T23:42:24+05:30 IST
అదనపు కట్న వేధింపులకు గురవుతున్న శంఖా కావ్యకు న్యాయం చేయాలని పలాస వైశ్య సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పలాస: అదనపు కట్న వేధింపులకు గురవుతున్న శంఖా కావ్యకు న్యాయం చేయాలని పలాస వైశ్య సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. పలాసకు చెందిన కావ్యకు మన్యం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెం దిన శంఖా అవినాష్‌తో వివాహం జరిగిందని, వీరు దుబాయ్‌లో నివాసం ఉం టున్నారని చెప్పారు. అదనపు కట్నం కోసం కావ్యను నిత్యం భర్త వేధిస్తున్నాడని, ఇదే సమయంలో తన రెండేళ్ల కుమార్తె భవిష్యకు ట్రావెల్ బ్యాన్ పెట్టి దేశం విడిచి వెళ్లకుండా అవినాష్ అడ్డుపడ్డాడని తెలిపారు. దీంతో తల్లికుమార్తె ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారని, తక్షణమే అధికారులు స్పందించి కావ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్‌కుమార్, వైశ్యసంఘం అధ్యక్షుడు మల్లా కృష్ణారావు, మల్లా రామేశ్వరరావు, టంకాల రవి శంకర్‌గుప్తా, కోట్ని శశికుమార్, కొత్తకోట తిరుమలరావు పాల్గొన్నారు.