బడ్జెట్‌లో కడప ఉక్కుకు అధిక నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-03-06T04:54:29+05:30 IST

త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో కడప ఉక్కు పరిశ్రమకు, విద్య, యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంగాసురేష్‌, ప్రొద్దుటూరు అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి జాఫర్‌ సాదక్‌ డిమాండ్‌ చేశారు.

బడ్జెట్‌లో కడప ఉక్కుకు అధిక నిధులు కేటాయించాలి

ప్రొద్దుటూరు టౌన్‌, మార్చి 5 : త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో కడప ఉక్కు పరిశ్రమకు, విద్య, యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంగాసురేష్‌, ప్రొద్దుటూరు అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి జాఫర్‌ సాదక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఎన్జీఓ హోంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రషీద్‌ ఖాన్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకుడు కృష్ణారెడ్డి, డీఎ్‌సఓ జిల్లా కన్వీనర్‌ కొండయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు. 

Read more