ముందస్తు సమాచారం లేకుండా గ్రామసభా?
ABN , First Publish Date - 2022-10-08T04:57:51+05:30 IST
ముందస్తు సమాచారం లేకుండా గ్రామసభా?
- అధికారుల తీరుపై సభ్యులు అసహనం
పాతపట్నం: స్థానిక సచివాలయం-1లో శుక్రవారం నిర్వహించిన మేజర్ పంచాయతీ గ్రామసభపై ముందస్తు సమాచారం లేకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా నియమిస్తారని వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. గత ఈవో, ప్రత్యేక పరిపాలనాధికారి హయాంలో జరిగిన అవకతవకలపై గత గ్రామసభలోనే ప్రస్తా వించినా ఎటువంటి చర్యలు తీసుకోకుండానే మళ్లీ ఇప్పుడు సభ ఎలా నిర్వహిస్తారని ఈవోపీఆర్డీ నర్సింహప్రసాద్ పండను వార్డ్మెంబరు పోలు బోతు రాము, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కనకల కర్రెన్న నిలదీశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈవోపీఆర్డీ ప్రయత్నించినా సభ్యులు వినకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసు కోకపోవడంపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఈవో టి.కూర్మారావు మా ట్లాడుతూ... ఈ విషయమై డీఎల్పీవో ఇప్పటికే విచారణ చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ సిర్ల వేణమ్మ ఎంపీడీవో పేడాడ జయంత్ ప్రసాద్, వైస్‌ఎంపీపీ సవిరిగాన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.