రహదారుపైనే ధాన్యం

ABN , First Publish Date - 2022-12-07T00:06:56+05:30 IST

‘ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఇక కొనుగోళ్లే తరువాయి’ అన్నట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గింజ ధాన్యం కూడా కొనుగోలు చేసినట్టు కనిపించడం లేదు. ఎప్పుడో ఖరీఫ్‌ ప్రారంభంలో, ఉబాలు వేసినప్పుడు అధికారులు హడావుడి చేశారు. తీరా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు ప్రారంభించినా తేమశాతం, ఇతర నిబంధనలను తెరపైకి తెచ్చి కొర్రీలు పెడుతున్నారు.

రహదారుపైనే ధాన్యం
చిక్కాలవలస సమీపంలో రోడ్డుపై ధాన్యం నిల్వలు

రహదారుపైనే ధాన్యం

కానరాని కొనుగోళ్లు

అన్నదాతలకు ఇక్కట్లు

నరసన్నపేట, డిసెంబరు 6: ‘ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఇక కొనుగోళ్లే తరువాయి’ అన్నట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గింజ ధాన్యం కూడా కొనుగోలు చేసినట్టు కనిపించడం లేదు. ఎప్పుడో ఖరీఫ్‌ ప్రారంభంలో, ఉబాలు వేసినప్పుడు అధికారులు హడావుడి చేశారు. తీరా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు ప్రారంభించినా తేమశాతం, ఇతర నిబంధనలను తెరపైకి తెచ్చి కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు గోనె సంచుల భారం రైతులపైనే పడుతోంది. ఒక్కో సంచి రూ.12లు ఉండగా.. ప్రభుత్వం మాత్రం రూ.6.70 చెల్లిస్తోంది. అటు శాంపిళ్ల సేకరణకు సంబంధించి సిబ్బంది కొరత వేదిస్తోంది. రవాణాలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు రవాణా, హమాలీ ఖర్చులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని చెబుతున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రవాణా చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ధాన్యం నిల్వలు కల్లాలు, రహదారులకు పరిమితమవుతున్నాయి.

Updated Date - 2022-12-07T00:06:58+05:30 IST