ప్రభుత్వం ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-12-15T23:37:09+05:30 IST

కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి వందకు పైగా పతకాలు సాధించిన సుబలయి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన కరాటే మా స్టర్‌ తోట సింహాచలాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ప్రోత్సహించాలి
పతకాలు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కలమట

హిరమండలం: కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి వందకు పైగా పతకాలు సాధించిన సుబలయి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన కరాటే మా స్టర్‌ తోట సింహాచలాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్‌ చేశారు. గురువారం రాత్రి సింహాచలం ఇంటిని సందర్శించిన ఆయన కరాటే పోటీల్లో సాధించిన పతకాలను పరిశీలించి అభినందించారు. ఇంతటి ప్రతిభ ఉన్న సింహాచలం కుటుంబ పోషణకు కూలి పనులు చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని కలమట హామీ ఇచ్చారు.ఈయనతో పాటు జడ్పీటీసీ బుచ్చిబాబు, సర్పంచ్‌ లంక రోజారాణి, బర్రి సురేష్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-15T23:37:10+05:30 IST