పెళ్లికి వెళ్తూ మృత్యుఒడికి..

ABN , First Publish Date - 2022-05-15T05:27:35+05:30 IST

పెళ్లికి వెళ్తున్న ఆ యువకుడిని టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించించింది.

పెళ్లికి వెళ్తూ మృత్యుఒడికి..
దుర్గారెడ్డి (ఫైల్‌):

 ఆటోను ఢీకొన్న టిప్పర్‌ ఫ యువకుడి దుర్మరణం 

 ఐదుగురికి గాయాలు ఫ ఒకరి పరిస్థితి విషమం

ఎచ్చెర్ల, మే 14: పెళ్లికి వెళ్తున్న ఆ యువకుడిని టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించించింది. ఆటోను టిప్పర్‌ ఢీకొన డంతో తోటపాలెం పరిధి అఖిన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన అలుపన దుర్గారెడ్డి (20) దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అఖిన్‌ఖాన్‌పేటకు చెందిన దుర్గారెడ్డితో పాటు అలుపన చిన్న మ్మ, దొరెడ్ల జస్వంత్‌, కొంతల లక్ష్మిలు అదే గ్రామానికి చెందిన అలుపన రామారావు ఆటోలో పొందూరు మండలం బాణాం గ్రామంలో జరుగుతున్న పెళ్లికి శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో బయలుదేరారు. చిలకపాలెం- పొందూరు రోడ్డులో అరిణాం అక్కివలస పంచాయతీ పరిధిలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌.. ఆటోను ఢీకొంది. దుర్గారెడ్డికి టిప్పర్‌ కొక్కేం తగలడంతో ఒక్క ఉదుటున కిందకు పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నమ్మడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. మిగతా నలుగురు స్వల్పంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 గ్రామంలో విషాదం..

దుర్గారెడ్డికి తల్లిదండ్రులు దాలిరాజు, లక్ష్మితో పాటు ఓ చెల్లెలు ఉంది. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు చదివిన దుర్గారెడ్డి వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటు న్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గారెడ్డి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు హృదయ విదారకరంగా విలపిస్తున్నారు. 





Updated Date - 2022-05-15T05:27:35+05:30 IST