ఘనంగా అమ్మవార్ల ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-18T05:31:49+05:30 IST

పెంటూరులో కొలువైన చింతపోలమ్మ, నీలమణి దుర్గ ఆలయాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు రేజేటి బోసుబాబు, సహాయకులు రమేష్‌శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన, హోమం చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఘనంగా అమ్మవార్ల ఉత్సవాలు
ఎల్‌ఎన్‌పేట: సామూహిక పూజల్లో పాల్గొన్న భక్తులు

నందిగాం: పెంటూరులో కొలువైన చింతపోలమ్మ, నీలమణి దుర్గ ఆలయాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు రేజేటి బోసుబాబు, సహాయకులు రమేష్‌శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన, హోమం చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


స్కాట్‌పేటలో...

ఎల్‌.ఎన్‌.పేట: స్కాట్‌పేట గ్రామంలో వెలసిన చెవిటమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య ఉదయం నుంచి గ్రామస్థులు పూజా కార్య క్రమాలను భక్తి శ్రద్ధలతో చేశారు. ప్రతీయేటా వైశాఖ మాసంలో చెవిటమ్మతల్లి ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

Updated Date - 2022-05-18T05:31:49+05:30 IST