లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం

ABN , First Publish Date - 2022-03-06T04:57:55+05:30 IST

లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టరీత్యా కేసులు నమోదుచేస్తామని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శాంతికళ పేర్కొన్నారు.

లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 5: లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టరీత్యా కేసులు నమోదుచేస్తామని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శాంతికళ పేర్కొన్నారు. శనివారం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి సభాభవనంలో పీసీటీఎన్‌డీటీ సమావేశంలో డాక్టర్‌ శాంతికళ మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అలాంటి స్కానింగ్‌ సెంటర్లకు మొదటి తప్పుగా రూ.10 వేలు జరిమానా, రెండో సారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. అలాగే అలాంటి స్కానింగ్‌సెంటర్లను మూసివేసి డాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రాజేశ్వరి, డాక్టర్‌ అనూష, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది సాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:57:55+05:30 IST