చంద్రబాబును కలిసిన గౌతు శిరీష

ABN , First Publish Date - 2022-06-08T05:16:35+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌతు శిరీష మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్టారని గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. సోమవారం సీఐడీ విచారణలో తనకు ఎదురైన ఇబ్బందులను శిరీష మీడియాకు వి

చంద్రబాబును కలిసిన గౌతు శిరీష
చంద్రబాబుతో మాట్లాడుతున్న గౌతు శిరీష

పలాస, జూన్‌ 7: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌతు శిరీష మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్టారని గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. సోమవారం సీఐడీ విచారణలో తనకు ఎదురైన ఇబ్బందులను శిరీష మీడియాకు వివరించిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. తనను కలవాలని సూచించారు. దీంతో మంగళవారం పలాస నియోజకవర్గ టీడీపీ నాయకులతో చంద్రబాబును కలిశారు. సీఐడీ విచారణపై చంద్రబాబు ఆరాతీయగా శిరీష భావోద్వేగానికి గురయ్యారు. సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును వివరించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని.. భయపడాల్సిన పనిలేదని.. పార్టీ అండదండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సీఐడీ కార్యాలయంలో శిరీష వ్యవహరించిన తీరును అభినందించారు. చంద్రబాబును కలిసిన వారిలో వై.వెంకన్నచౌదిరి,  పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు సుజాత, దాసునాయుడు, జీకే నాయుడు, సంతోష్‌కుమార్‌ ఉన్నారు.

Read more