ఆటలే.. నిధుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-11-30T00:12:07+05:30 IST

పాఠశాలల్లో గ్రిగ్స్‌ పోటీలను మండల, జిల్లాస్థాయిలో నిర్వ హించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలి చ్చింది. నిర్వహణ బాధ్యతను విద్యా శాఖ కు అప్పగించింది. కానీ నిధులు కేటా యించ లేదు. క్రీడల నిర్వహణకు స్థానిక వనరులు సర్దుబాటు చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎంఈవో లకు వర్తమానం వచ్చింది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఆటలే.. నిధుల్లేవ్‌!
పాతర్లపల్లిలో క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులు

- పాఠశాల క్రీడాపోటీలకు డబ్బులివ్వని ప్రభుత్వం

- స్థానికంగా సర్దుబాటు చేసుకోవాలని సూచన

- పీఈటీలు, వ్యాయామ ఉపాధ్యాయుల ఆవేదన

- మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

(రణస్థలం)

రణస్థలం మండలానికి సంబంధించి పాఠశాల స్థాయి క్రీడాపోటీల నిర్వహణను పాతర్లపల్లి జడ్పీ హైస్కూల్‌కు అప్పగించారు. మండల వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభమైన పోటీలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. విద్యార్థులకు భోజనం, ఇతరత్రా వసతులు, ఖర్చులతో సగటున రూ.లక్ష ఖర్చవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నిధులు మంజూరుకాలేదు. అదేలా అంటే ఉన్నతాధికారులు స్థానికంగా సర్దుబాటు చేసుకోవాలని సూచించారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

.........................

..జిల్లాలోని 30 మండ లాల్లోనూ ఇదే పరిస్థితి. పాఠశాలల్లో గ్రిగ్స్‌ పోటీలను మండల, జిల్లాస్థాయిలో నిర్వ హించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలి చ్చింది. నిర్వహణ బాధ్యతను విద్యా శాఖ కు అప్పగించింది. కానీ నిధులు కేటా యించ లేదు. క్రీడల నిర్వహణకు స్థానిక వనరులు సర్దుబాటు చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎంఈవో లకు వర్తమానం వచ్చింది. ఈ మేరకు పోటీల నిర్వహణకు అనువైన కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశా లలో మధ్యాహ్న భోజన నిర్వహణతో క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా పరికరాలు, మైదానా ల నిర్వహణ, ఇతరత్రా వసతుల కోసం స్థానికంగా దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నారు. అదీ కుద రకపోతే పీఈటీలు, వ్యాయామ ఉపాధ్యా యులు, హెచ్‌ఎంలు తలో మొత్తం వేసు కొని వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో వంటి పోటీ లు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ప్రతీ మండలం నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశముంది. పెద్ద మండలాలు అయితే ఈ సంఖ్య 500కు దాటుతోంది. సగ టున విద్యార్థికి రూ.100చొప్పున అయినా రూ.50వేల వరకు ఖర్చవుతోంది. కానీ ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో పాఠ శాలకు రూ.10వేల వరకు నిధులు సమ కూర్చే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లపాటు కరోనా పేరు చెప్పి క్రీడా పోటీలు నిర్వహించలేదు. గతేడాది చివర్లో ఆదరాబాద రగా సీఎం కప్‌ పేరిట క్రీడా పోటీలు నిర్వ హించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్నా నిధుల కేటాయించలేదు. దీంతో క్రీడల నిర్వహణ భార మవుతోందని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోటీల నిర్వహణను ఏ పాఠశాలకు అప్పగించినా.. విముఖత చూపిస్తు న్నారు. ఈ భారాన్ని పీఈటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు తమ నెత్తిన వేసుకుంటున్నా రు. గతంలో పోటీల నిర్వహణకు క్రీడా శాఖను కూడా భాగస్వామ్యం చేసేవారు. ఇప్పుడు కేవ లం పాఠశాల విద్యాశాఖకే సరిపెట్టడం కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నారు. అరకొర వసతుల నడుమ సాగుతున్న పోటీల నిర్వహణతో విద్యా ర్థులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. అర్ధాకలితో గడుపుతున్నారు.

సదుపాయాలు లేవు?

ప్రభుత్వం భారీగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇక్కడకు వచ్చాక కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణం.

- జీ దుర్గాప్రసాద్‌, విద్యార్థి, పాతర్లపల్లి

నిధులు కేటాయించాలి

నాలుగు రోజుల కిందట క్రీడాపోటీలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాలేదు. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల సహకారంతో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక నిధులు కేటాయించి.. క్రీడలను ప్రోత్సహించాలి.

- సుశీల, వ్యాయామ ఉపాధ్యాయురాలు, పాతర్లపల్లి

ఆదేశాల మేరకు

మండలస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలొచ్చాయి. మా మండలానికి సంబంధించి అనువైనది గుర్తించి పాతర్లపల్లి పాఠశాలను ఎంపిక చేశాం. అయితే దీనికి ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు. అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోటీలు నిర్వహిస్తున్నాం.

- వై.త్రినాథరావు, ఎంఈవో, రణస్థలం

Updated Date - 2022-11-30T00:12:09+05:30 IST