పూర్తిస్థాయి వేతనం పొందాలి: డ్వామా పీడీ
ABN , First Publish Date - 2022-12-16T23:14:27+05:30 IST
ఉపాధి పథకం ద్వారా వేతనదారులు పూర్తిస్థాయిలో వేతనం పొందేలా పనులు చేపట్టాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు సూచించారు.
బూర్జ: ఉపాధి పథకం ద్వారా వేతనదారులు పూర్తిస్థాయిలో వేతనం పొందేలా పనులు చేపట్టాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు సూచించారు. శుక్రవారం వైకుంఠపురం పంచాయతీ పరిధి అల్లిపిల్లిగూడలోని రాళ్ల చెరువు పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్ధేశించిన కొలతలు ప్రకారం రెండుపూటలా పనులు చేస్తే గరిష్ట వేతనం పొందవచ్చునన్నారు. కూలీలందరికీ పనికల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీడీ హరిత, ప్లాంటేషన్ సూపర్‌వైజర్ జి.రామచంద్రరావు, ఏపీవో రాజ్‌కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు రామకృష్ణ, తిరుపతిరావు, సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.