ప్లాస్టిక్‌పై అవగాహన కోసం..

ABN , First Publish Date - 2022-12-27T00:01:03+05:30 IST

ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిం చేందుకు మహారాష్ట్రకు చెందిన పూణే యూనివర్సిలో ఎంఏ ఎకనామిక్స్‌ చదువుతున్న యువకుడు బీఎస్‌ ఏక్‌నాఽథ్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర సోమవారం జిల్లాకు చేరింది.

ప్లాస్టిక్‌పై అవగాహన కోసం..

- కోల్‌కత్తా నుంచి యువకుడి సైకిల్‌ యాత్ర

ఇచ్ఛాపురం రూరల్‌: ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిం చేందుకు మహారాష్ట్రకు చెందిన పూణే యూనివర్సిలో ఎంఏ ఎకనామిక్స్‌ చదువుతున్న యువకుడు బీఎస్‌ ఏక్‌నాఽథ్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర సోమవారం జిల్లాకు చేరింది. దేశంలోని తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యం ఆందోళన కలిగిస్తుండడంతో పీజీ విద్యార్థి ఏక్‌నాఽథ్‌ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ దుష్ప్రభావాలు, సముద్ర జీవులపై దాని ప్రభావం గురించి సైకిల్‌యాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.ఈనెల 15న కోల్‌కత్తాలో ప్రారం భించిన సైకిల్‌యాత్ర 40 రోజుల వరకు కన్యాకుమారి వరకు సాగుతుందని చెప్పాడు. సోమవారం డొంకూరు, లక్ష్మీపురం బీచ్‌లో పర్యటించాడు. స్థానికులు, పర్యాట కులకు ప్లాస్టిక్‌పై అవ గాహన కల్పిస్తున్నట్లు ఆయన చెప్పాడు.

Updated Date - 2022-12-27T00:01:04+05:30 IST