విద్యుదాఘాతంతో ఐదు మూగజీవాలు మృతి
ABN , First Publish Date - 2022-10-07T05:47:02+05:30 IST
విద్యుదాఘాతంతో ఐదు మూగజీవాలు మృతి
బూర్జ: గోపిదేవిపేట గ్రామ సమీపం లో బుధవారం విద్యుదాగాతంతో ఐదు మూగ జీవాలు మృతి చెందాయి. పీఎల్ దేవిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటన్న, డోల కాంతారావు అనే పాడి రైతులకు సంబం ధించిన మూగజీవాలుగా స్థానికులు గుర్తించారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధిత రైతులు ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘటనా స్థలాన్ని పశువైద్యాధికారి వెంకటరావు పరిశీలించారు. పీఎల్ దేవిపేట సర్పంచ్ మజ్జి ద్రోణగిరిరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.