గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు నేరం

ABN , First Publish Date - 2022-12-06T23:31:21+05:30 IST

గర్భస్థ శిశులింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని కింతలి పీహెచ్‌సీలో గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు నేరం
మాట్లాడుతున్న సన్యాసినాయుడు

పొందూరు: గర్భస్థ శిశులింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని కింతలి పీహెచ్‌సీలో గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు ఎన్‌.మల్లేశ్వరి, శివశంకర్‌, న్యాయవాది ఇందిరాప్రసాద్‌ పాల్గొన్నారు

Updated Date - 2022-12-06T23:31:22+05:30 IST