రైతుల్లో తుఫాన్‌ గుబులు

ABN , First Publish Date - 2022-12-07T23:54:29+05:30 IST

ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంటను ఇంటికి తెచ్చుకునే సమయం ఆసన్న మైన సమయంలో తుఫాన్‌ ప్రకటన రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. వాతావర ణంలో ఒక్కసారి వచ్చిన మార్పులతో పంటను రక్షించేందుకు పడరానిపాట్లు పడు తున్నారు.

రైతుల్లో తుఫాన్‌ గుబులు
నందిగాం: పొలంలోనే వరి కుప్పలు పెడుతున్న దృశ్యం

నరసన్నపేట/మెళియాపుట్టి/నందిగాం/ఇచ్ఛాపురంరూరల్‌/సోంపేట: ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంటను ఇంటికి తెచ్చుకునే సమయం ఆసన్న మైన సమయంలో తుఫాన్‌ ప్రకటన రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. వాతావర ణంలో ఒక్కసారి వచ్చిన మార్పులతో పంటను రక్షించేందుకు పడరానిపాట్లు పడు తున్నారు. కొందరు పొలాల్లో వరి సనలు కుప్పలు పెట్ట డంతో పాటు మరికొందరు ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుతూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నరసన్న పేట నియోజకవర్గంలో 12 వేల హెక్టార్లలో వరి కుప్పలు పొలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మెళియాపుట్టి, నందిగాం మండలాల్లోనూ పంట రక్షణ చర్యల్లో రైతులు నిమగ్నమయ్యారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలాస ఆర్డీవో టి.సీతారామమూర్తి తెలిపారు. సోంపేట మండలం భూష భద్ర రైతు భరోసా కేంద్రంలో అధికారులతో బుధవారం సమీక్షించారు. పంటలు నష్టపోకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-12-07T23:54:31+05:30 IST