ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి

ABN , First Publish Date - 2022-12-15T23:46:24+05:30 IST

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి
అచ్చెన్నాయుడికి జ్ఞాపిక అందిస్తున్న టీడీపీ నాయకులు

టెక్కలి: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. గురువారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన టెక్కలి మండల టీడీపీ నాయకులకు పలు సూచనలు చేశారు. ఏఏ రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఏఏ వర్గాలకు ప్రభుత్వం మోసం చేస్తుంది, పెరుగుతున్న ధరలు, పెంచిన చార్జీలు ప్రభావం, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి వంటి వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పార్టీ నాయకులు దవళ రామచంద్రుడు, వెంకట్‌, రాజశేఖర్‌, సత్తిబాబు తదితరులు ఉన్నారు.

- నందిగాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నందిగాం మండలానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం కలిశారు తెలుగు యువత అధ్యక్షుడు తూలుగు ఉమామహేశ్వరరావు, కాపుతెంబూరు పార్టీ ప్రతినిధి పాడి ప్రభాకరరావు, తమిరె ఫల్గుణరావు తదితరులు కలిశారు.

Updated Date - 2022-12-15T23:46:27+05:30 IST