‘ఓటీఎస్’ ప్రయోజనాలను వివరించండి
ABN , First Publish Date - 2022-03-06T05:20:50+05:30 IST
ఓటీఎస్ ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించాలని సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ కోరారు.
ఇచ్ఛాపురం రూరల్: ఓటీఎస్ ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించాలని సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ కోరారు. శని వారం మండలంలోని అరకపద్ర, కొలిగాం, కీర్తిపురం, బిర్లంగి, కొఠారి సచివాలయాలను తనిఖీ చేశారు. ఓటీఎస్ వసూలులో వెనుకబా టుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. కీర్తిపురంలో 290 లక్ష్యం కాగా కేవలం ఒక లబ్ధిదారుడే ఓటీఎస్ కట్టడంతో పథకం గురించితెలియజేయాలని సిబ్బందికి సూచిం చారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.శంకరరావు, డీటీ శ్రీహరి, ఆర్‌ఐలు బి.కృష్ణమూర్తి, కృష్ణప్రసాద్ రౌళో పాల్గొన్నారు.
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో బి.వెంక టరమణ తెలిపారు. శనివారం ఇచ్ఛాపురంలో ఉపాధి హామీ క్షేత్ర సమీక్షించారు. ఉపాధి నిధులతో జరుగుతున్న భవనాలు, గృహ నిర్మాణ పనుల అభివృద్ధి, బిల్లులపై పీఆర్ సిబ్బందితో చర్చించారు.
సచివాలయ సేవలు మెరుగుపరచండి
కవిటి: సచివాలయ సేవలు మెరుగుపర చాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు. శనివారం మండలంలోని కరాపాడు, కవిటి-3 సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా సచివాలయంలో రికార్డులు, హాజరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, లబ్ధిదారుల జాబితాలు పరిశీలించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని, బయోమె ట్రిక్ తప్పనిసరిగా వేయాలని తెలిపారు. కార్యక్ర మంలో ఈవోపీఆర్డీ శివాజీ పాణిగ్రాహి, సర్పంచ్ లచ్చయ్య పాల్గొన్నారు.
త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
ఆమదాలవలస రూరల్: జగనన్నకాల నీల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో ఎం.రేణుక సూచించారు. శనివారం మండలంలో చింతలపేట, బొబ్బిలి పేట, శ్రీనివాసా చార్యులపేట, మునగవలన, చిన్నజొన్నవ లనల్లో లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించారు.