విద్యా ప్రమాణాలు పెంచాలి
ABN , First Publish Date - 2022-12-31T23:52:37+05:30 IST
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో శనివారం నిర్వహించిన డిగ్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎచ్చెర్ల: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో శనివారం నిర్వహించిన డిగ్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యామండలి నిర్ణయించిన అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా సిలబస్ పూర్తి, పరీక్షలు జరగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ ఏ రాజేంద్రప్రసాద్, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుక ల్లో భాగంగా వర్సిటీలో శనివారం సాయంత్రం వీసీ వెంక టరావు కేక్‌ను కట్ చేశారు.