అక్షరాస్యతతోనే ఆర్థిక స్వావలంబన : స్పీకర్‌

ABN , First Publish Date - 2022-03-05T05:54:55+05:30 IST

అక్షరాస్యతతోనే ఆర్థిక స్వావలంబన : స్పీకర్‌

అక్షరాస్యతతోనే ఆర్థిక స్వావలంబన : స్పీకర్‌
పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

ఆమదాలవలస : అక్షరాస్యతతోనే ఆర్థిక  స్వావలంబన సాధించవచ్చునని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. గాజులుకొల్లివలస సమీపంలోని వంశధార నిర్వాసిత గ్రామంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంద న్నారు. కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠ శాలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. నియోజక ర్గంలో మండలానికి ఒకటి చొప్పున తాడివలస, వంజంగి, రొట్టవలస, ఉప్పినవలస గ్రామాల్లో ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే తొగరాంలో డిగ్రీ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రారంభించామన్నా రు. తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.  డీఈవో లింగేశ్వర రెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీపతి, సర్వశిక్షణ అభియాన్‌ పీవో రోణంకి జయప్రకాష్‌, జడ్పీటీసీ బెండి గోవిందరావు, తమ్మినేని శ్రీరామమూర్తి, సర్పంచ్‌ దమయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:54:55+05:30 IST