మాదక ద్రవ్యాలకు బానిసకావొద్దు: ఎస్పీ
ABN , First Publish Date - 2022-06-26T05:36:17+05:30 IST
మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిస కావొద్దని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సంద ర్భంగా శివానీ ఇంజనీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలను అమ్మడం,

ఎచ్చెర్ల, జూన్ 25: మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిస కావొద్దని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సంద ర్భంగా శివానీ ఇంజనీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలను అమ్మడం, కొనడం చట్టరీత్యానేరమన్నారు. ధూమపానం, మద్యం సేవించడం, హెరాయిన్, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్ధాలకు అలవాటు పడితే ఏకాగ్రతను కోల్పోయి, మానసికం గా కృంగిపోతారన్నారు. మత్తు పదార్ధాల వల్ల కేన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయి, కుటుంబ బంధాలను కూడా కోల్పోతారని తెలిపారు. యువత సత్ప్రవర్తన కలిగి ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియ జేయాలన్నారు అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో శివానీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జె.బాలభాస్కర్, శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ ఎం.మహేంద్ర, సీఐ స్వామినాయుడు, ఎస్ఐలు రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు.