రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టు
ABN , First Publish Date - 2022-12-31T23:45:18+05:30 IST
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల టెన్నీకాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు.
పలాస: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల టెన్నీకాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా టెన్నీకాయిట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో బాలుర జట్టులో బి.సిద్ధార్థ, ఎల్.రాజు, టి.గణేష్, టి.వెంక టేష్, బాలికల జట్టులో ఎ.షర్మిళ, టి. దివ్య, జె.భవాని, పి.శ్రావణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బీవీ మోహన్, హెచ్‌ఎం డి.తులసీరావు, మల్లా భద్రయ్య, పీడీలు కె.హరిబాబు, పద్మలోచనరావు, దామోదర్, గోవింద్, సంతోష్ పాల్గొన్నారు.