వివక్షే వైసీపీ అజెండా

ABN , First Publish Date - 2022-12-31T00:18:21+05:30 IST

వివక్షే వైసీపీ అజెండాగా రాష్ట్రంలో పాలన సాగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ అన్నారు.

వివక్షే వైసీపీ అజెండా

పాతపట్నం: వివక్షే వైసీపీ అజెండాగా రాష్ట్రంలో పాలన సాగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 3.5లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా జనవరి మొదటి వారంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం యువతలో నూతనోత్సాహం నింపుతోందన్నారు. లోకేష్‌కు మద్దతుగా యువత నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు పైల లక్ష్మయ్య, సైలాడ సతీష్‌, కనకల నారాయణ, ఎ.సన్యాసి, నల్లి లక్ష్మణ, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:18:21+05:30 IST

Read more