సరిహద్దులో డీజిల్ దొంగలు!
ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST
సరిహద్దులో డీజిల్ దొంగలు!

- నైట్‌హాల్ట్ వాహనాల్లోని ఇంధనం చోరీ
- హడలిపోతున్న వాహనదారులు
- తూతూ మంత్రంగా తనిఖీలు
పాతపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు పాతపట్నంలో డీజిల్ దొంగలు రెచ్చి పోతున్నారు. రాత్రివేళ ఆగిఉన్న వాహనాల్లో ఇంధనం చోరీకి పాల్ప డుతున్నారు. దీంతో వాహనదారులు హడ లిపోతున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో అచ్చుతాపురం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రతి రోజూ పదుల సంఖ్యలో బస్సులు నైట్‌హాల్ట్ చేస్తా యి. జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులతో పాటు దూ రప్రాంతాలకు వెళ్లాల్సిన వివిధ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ప్రధాన రోడ్డుకి ఇరువైపు లా నైట్‌హాల్ట్‌గా ఉంటున్నాయి. దీనికితోడు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన వసతులు లేకపో వడంతో శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సులను కూడా ఇక్కడే నిలుపుదల చేస్తున్నారు. ఇదే అదునుగా కొంతమంది వాహనాల్లోని డీజిల్‌ను దొంగ తనం చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీజిల్ ట్యాంకుల తాళాలు పగు లగొట్టి అందులోకి ఓ గొట్టం పెట్టి దాన్ని కేన్ల కు అ మర్చి చడీచప్పుడు లేకుండా వెళ్లిపో తున్నారు. దీంతో ట్యాంక్‌లోని డీజిలంతా ఖాళీ అయిపోతుంది. కొంత సమయం తర్వాత వచ్చి డీజిల్‌తో ఉన్న కేన్లను తమ వాహనాల్లో తర లించుకుపోతు న్నారు. ఇలా ఈ ప్రాంతంలో డీజి ల్ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల ఒకేరోజు సు మారు నాలుగు ఆర్టీసీ బస్సుల్లో 50 లీటర్ల డీజిల్ చొప్పున దొంగిలించినట్టు సిబ్బంది వాపోతున్నారు. పోలీసుల గస్తీ పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.
మూతపడిన చెక్ పోస్ట్
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరువలో ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎస్‌ఈబీ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన చెక్‌పోస్ట్ మూతపడింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో దొంగలు మరిం త రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.
నిఘా పెంచుతాం
డీజిల్ దొంగతనాలపై ఫిర్యాదులు అందాయి. దొంగతనాల నియంత్రణకు చర్యలు తీ సుకుంటాం. దొంగలను పట్టుకొనేందుకు నిఘా పెంచుతాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం.
- మహమ్మద్ అమీర్ ఆలీ, ఎస్‌ఐ