ధనుర్మాస వేడుకలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-16T23:22:11+05:30 IST

ధనుర్మాసం పూజలు ఉల్లాసపేట వేంకటే శ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. ఈ సందర్భంగా నెలగంటు పెట్టి శ్రీవారికి విశేష అభిషేకాలు చేసి పుష్పా లతో అలంకరించారు.

ధనుర్మాస వేడుకలు ప్రారంభం
స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

పలాస, డిసెంబరు 16: ధనుర్మాసం పూజలు ఉల్లాసపేట వేంకటే శ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. ఈ సందర్భంగా నెలగంటు పెట్టి శ్రీవారికి విశేష అభిషేకాలు చేసి పుష్పా లతో అలంకరించారు. నిత్యాన్న దానం చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసా చార్యులు, ధర్మకర్త డోకి రామారావు, దుర్గాప్రసాద్‌పాత్రో, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ధనుస్సంక్రమణం హోమాలు

పలాసరూరల్‌: స్థానిక జగన్నాథ ఆలయంలో జైజగన్నాథ్‌ ఒడియా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధనుస్సంక్రమణ పూజలు, హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ కార్యదర్శి బాబూరావు పండా, కామేశ్వర పండా, రాఘవపండా, దాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:22:13+05:30 IST