విధ్వంసమే వైసీపీ విధానం

ABN , First Publish Date - 2022-03-06T05:21:46+05:30 IST

విధ్వంసమే వైసీపీ ప్రభుత్వ విధానమని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు.

విధ్వంసమే వైసీపీ విధానం
మాట్లాడుతున్న రవికుమార్‌

 టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌


పొందూరు, మార్చి 5: విధ్వంసమే వైసీపీ ప్రభుత్వ విధానమని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌  ఆరోపించారు. శనివారం మండలంలోని లక్ష్మీపేటలో ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఎం.ఆదినారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తప్పుడు హామీలతో రాష్ట్రప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధ్వంశకర చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావేదికతో మొదలైన వైసీపీ ప్రభుత్వ విధ్వంశం మూడురాజధానుల పేరుతో రాష్ట్ర రాజధాని అమరావతి విధ్వంశంతో పరాకాష్ట్రకు చేరిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులు పాలవడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. మాజీ మంత్రి వివేకానంద హత్యకేసులో అసలు దోషులకు వంతపాడుతూ ఆయన  కుమార్తె, అల్లుడుకు అంటగడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ప్రధానకార్యదర్శి బి.గిరిబాబు, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, వండాన మురళి పాల్గొన్నారు.


Read more