‘ఉపాధి’ పనుల్లో జాప్యం తగదు

ABN , First Publish Date - 2022-03-06T03:48:15+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో జాప్యం తగదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రూ.100కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు ఉన్నా పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు.

‘ఉపాధి’ పనుల్లో జాప్యం తగదు
అధికార్లతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లాఠ్కర్‌

 మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు?
 అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం
 సహాయక ఇంజనీర్లకు షోకాజ్‌
 కలెక్టరేట్‌, మార్చి 5:
ఉపాధిహామీ పనుల్లో జాప్యం తగదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రూ.100కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు ఉన్నా పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదని  ప్రశ్నించారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఈలోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.  ఎటువంటి నిర్లక్ష్యం చేసినా నిధులు వృథా అయ్యే అవకాశంఉందన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే వారానికి పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌ శాఖ పనుల్లో నిర్లక్ష్యం వహించిన వంగర, రాజాం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన సహాయక ఇంజనీర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పర్యవేక్షణ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేసి... కొత్త ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జేసీలు కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మురళి, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ పీపీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ సేవలను విస్తృతం చేయండి
సచివాలయ సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని 930 మంది సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం అందించిన సెల్‌ఫోన్లను శనివారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఇక నుంచి పింఛన్ల పంపిణీ, తదితర సేవల కోసం ఈ ఫోన్లను వినియోగించాలని ఆయన సూచించారు.   

Updated Date - 2022-03-06T03:48:15+05:30 IST