రోడ్డు ప్ర మాదంలో డిగ్రీ విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2022-12-16T23:25:33+05:30 IST

జాతీయ రహదారి సమీపాన శ్యామసుందరాపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో డిగ్రీ విద్యార్థిని శాసనపురి కరిష్మా(19) మృతి చెందింది.

 రోడ్డు ప్ర మాదంలో  డిగ్రీ విద్యార్థిని మృతి
కరిష్మా (ఫైల్‌)

టెక్కలి రూరల్‌: జాతీయ రహదారి సమీపాన శ్యామసుందరాపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో డిగ్రీ విద్యార్థిని శాసనపురి కరిష్మా(19) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక ఎన్టీఆర్‌ కాలనీ 18వ లైన్‌లో నివాసముంటున్న శాసనపురి చిరంజీవులు, హేమలత పెద్ద కుమార్తె కరిష్మా. స్థానికంగా ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగే శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి ఆటోలో ఇంటికి వస్తున్న సమ యంలో శ్యామసుందరాపురం గ్రామ కూడలి వద్దకు వచ్చేసరికి స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారి కిందపడిపోయింది. ఆటో వెనుక చక్రం ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-12-16T23:25:34+05:30 IST