20న డప్పు కళాకారుల మహాసభలు
ABN , First Publish Date - 2022-12-13T00:02:07+05:30 IST
కొత్తూరులో ఈనెల 20న నిర్వహించనున్న జిల్లా దళిత డప్పు కళాకారుల ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు సన్న శెట్టి రాజశేఖర్, దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గ ణేష్ కోరారు.
హిరమండలం: కొత్తూరులో ఈనెల 20న నిర్వహించనున్న జిల్లా దళిత డప్పు కళాకారుల ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు సన్న శెట్టి రాజశేఖర్, దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గ ణేష్ కోరారు. ఈ మేరకు సోమ వారం డప్పుకళాకారులు హిరమండలంలో ర్యాలీ నిర్వ హించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణను ఖరా రు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిమ్మల సంజీవ్, మీసాల వెంకటరావు, గొర్లె రవి, ముంజేటి రామారావు, జి.అప్పలస్వామి పాల్గొన్నారు