దళితులపై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2022-06-08T05:08:42+05:30 IST

దళిత కు టుంబాలపై ప్రజాప్రతినిధుల కు చిన్నచూపు తగదని గేదెల పేట దళితులు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను నిలదీశారు.

దళితులపై చిన్నచూపు తగదు
ఎమ్మెల్యే కిరణ్‌ను నిలదీస్తున్న గ్రామస్థులు:


 ఎమ్మెల్యేను నిలదీసిన గేదెలపేట  ప్రజలు

జి.సిగడాం: దళిత కు టుంబాలపై ప్రజాప్రతినిధుల కు చిన్నచూపు తగదని గేదెల పేట దళితులు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. మంగళవారం ఈ గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గేదెలపేట దళితవాడలో 11 కు టుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్క ప్రయోజనం కూడా దక్కడం లేదని దార ఆదిలక్ష్మి, కె.మంగమ్మ, ఆర్‌.లక్ష్మి ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్‌, ఆశ, ఆయా పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. శిథిల గృహంలో బిక్కుబిక్కుమంటూ నివసిస్తూన్నామని, ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని లింగాల సూరప్పమ్మ, కొంచాడ రమేష్‌ నిలదీశారు. ఎన్నిలకు ముందు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నించా రు. పెద్దపెద్ద మాటలు ఆడొద్దని, తన క్యాంప్‌ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.సత్యవతి, జడ్పీటీసీ సభ్యుడు కె.రమణ, పేడాడ శ్రీరామ్‌, బూరాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.  

Read more