వ్యాన్‌ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-12-15T23:39:28+05:30 IST

అక్కవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం వ్యాన్‌ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన దంపతులు వూన జీవన్‌రావు, శ్రీలక్ష్మీ తీవ్రంగా గాయపడ్డారు.

 వ్యాన్‌ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

టెక్కలి రూరల్‌: అక్కవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం వ్యాన్‌ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన దంపతులు వూన జీవన్‌రావు, శ్రీలక్ష్మీ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై తమ మూడేళ్ల కుమారుడు హిమాన్స్‌తో కలిసి టెక్కలి వస్తుండగా అదే మార్గంలో వెనుక నుంచి వస్తు న్న బొలెరో వ్యాన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా, హిమాన్స్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జీవన్‌రావు, శ్రీలక్ష్మీని శ్రీకాకుళం ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. ఎస్‌ఐ-2 రమేష్‌బాబు కేసు నమోదు చేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి..

కోటబొమ్మాళి: పెద్దబమ్మిడి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన పిసినికి అప్పారావు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పారావు నరసన్నపేట నుంచి వస్తూ పెద్దబమ్మిడి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆయన కుడికాలు నజ్జు కాగా, తలకు బలమైన గాయాలయ్యాయి. 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ షేక్‌ఖాదర్‌భాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T23:39:31+05:30 IST