ఫీజులపై కొనసాగిన నిరసన

ABN , First Publish Date - 2022-12-15T23:50:57+05:30 IST

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అధిక ఫీజుల వసూలుపై చేపట్టిన నిరసన గురువారం కూడా కొనసాగింది.

 ఫీజులపై కొనసాగిన నిరసన

టెక్కలి రూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అధిక ఫీజుల వసూలుపై చేపట్టిన నిరసన గురువారం కూడా కొనసాగింది. పాతపట్నం, నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కన్నా టెక్కలిలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన కళాశాల యాజమా న్యం సీపీడీసీ ఫీజును తగ్గించింది. పెంచిన ఇతర ఫీజులు కూడా తగ్గించాలని డిమాండ్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్జాన దుర్గాప్ర సాద్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సీహెచ్‌ రవితేజ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:50:58+05:30 IST