-
-
Home » Andhra Pradesh » Srikakulam » Construction of 63 warehouses in the district-NGTS-AndhraPradesh
-
జిల్ల్లాలో 63 గిడ్డంగుల నిర్మాణం
ABN , First Publish Date - 2022-08-31T05:41:23+05:30 IST
జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల పరిధిలో 63 గిడ్డంగుల నిర్మాణానికి చర్య లు చేపడుతున్నామని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు.

సహకార అధికారి సుబ్బారావు
పొందూరు: జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల పరిధిలో 63 గిడ్డంగుల నిర్మాణానికి చర్య లు చేపడుతున్నామని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు. మంగళవారం పొందూరులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాము నిర్మాణంపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఒక్కో గోదాము రూ.40లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటివిడతలో మంజూరైన 24 గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండోవిడతలో 39 గోదాముల నిర్మా ణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. ప్రతిగోదాము నిర్మాణానికి కనీసం 32 సెంట్ల స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొందూరు పంచాయతీ పరిధిలో జోగన్నపేట వద్ద పీఏసీఎస్‌కు చెందిన 15 సెంట్ల స్థలంలో పెట్రోల్‌బంకు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు.