పింఛన్ల విచారణలో జాప్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-31T00:21:12+05:30 IST

పింఛన్లపై విచారణలో జాప్యంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పది రోజులైనా ఇంతవరకు నివేదికను ఎందుకు ఇవ్వలేదని టెక్కలి సచివాల యం-2 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.రాజేష్‌పై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అసహనం వ్యక్తం చేశారు.

పింఛన్ల విచారణలో జాప్యంపై కలెక్టర్‌ ఆగ్రహం
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌

టెక్కలి రూరల్‌: పింఛన్లపై విచారణలో జాప్యంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పది రోజులైనా ఇంతవరకు నివేదికను ఎందుకు ఇవ్వలేదని టెక్కలి సచివాల యం-2 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.రాజేష్‌పై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయాన్ని సందర్శిం చి, అందుతున్న సేవలపై విభాగాల వారీగా సమీక్షించారు. పింఛన్ల అంశం చర్చకు వచ్చిన సమయంలో సచివాలయానికి కేవలం 25 పింఛన్లు విచారణకు రాగా పదిరోజులైనా ఎందుకు పూర్తి చేయలేదని కలెక్టర్‌ ప్రశ్నించగా సిబ్బంది నీళ్లునమిలారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌.. మండల పరిధిలో పింఛన్ల విచారణలో జాప్యం చేస్తున్న మొదటి ముగ్గురు వెల్ఫేర్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయాలని మండల పరిషత్‌ కార్యాలయ ఏవో బి.రామకృష్ణకు సూచించారు. అనంతరం సచివాలయం పరిధిలోని వివిధ భూ సమస్యలు, కోర్టు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బొప్పాయిపురం సచివాలయం, ఆర్‌బీకేలకు పరిశీలించారు.

Updated Date - 2022-12-31T00:21:12+05:30 IST

Read more