పట్టుబడిన చైన్‌స్నాచర్లు

ABN , First Publish Date - 2022-10-24T00:19:29+05:30 IST

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 23: జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు చైన్‌స్నాచర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్ల డించారు. సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామానికి చెందిన సూరాడ రాజు (32)చెడు వ్యసనాలకు బానిసై చోరీలను వృత్తిగా చేసుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకుని మెళియాపుట్టి, కాశీబుగ్గ, నౌపడ, ఇచ్ఛాపురం, కవి

 పట్టుబడిన చైన్‌స్నాచర్లు

31 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 23: జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు చైన్‌స్నాచర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్ల డించారు. సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామానికి చెందిన సూరాడ రాజు (32)చెడు వ్యసనాలకు బానిసై చోరీలను వృత్తిగా చేసుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకుని మెళియాపుట్టి, కాశీబుగ్గ, నౌపడ, ఇచ్ఛాపురం, కవిటి, మందస, వజ్రపుకొత్తూరు, ఒడిశా రాష్ట్రం గురండిలో మొత్తం 13 చోరీలకు పాల్పడ్డాడు. 20 తులాల బంగారు పుస్తెలతాళ్లు, చైన్‌లను అపహరించాడు. చోరీల కోసం నెంబర్‌ ప్లేట్‌ల్లేని బైక్‌లను వినియోగించేవాడు. సెల్‌ టవర్‌ లోకే షన్‌లు, సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్‌లను కనిపెట్టి పోలీసులు ఎట్టకేలకు రాజును పట్టుకున్నారు. 20 తులాల బంగారు ఆభరణాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫ ఈ ఏడాది మే 19న శ్రీకాకుళం నగరంలోని సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ వద్ద ఓ మహిళ మెడలో నుంచి, అదేరోజు ఇచ్ఛాపురంలో మరో మహిళ మెడలోని చైన్‌లను తెంచుకుని బైక్‌పై పరారైన ఇరానీ గ్యాంగ్‌కు చెం దిన హైదర్‌ ఆలి(26), బసు ఆలి(42)లను పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరపడంతో శ్రీకాకుళం, ఇచ్ఛాపురంలలో చోరీలకు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. వీరినుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముగ్గురు దొంగల నుంచి 31 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. చైన్‌స్నాచర్లను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పాతపట్నం సీఐ ఎం.వినోద్‌బాబు, శ్రీకాకుళం సీఐ ఈశ్వర్‌ప్రసాద్‌, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-25T11:29:56+05:30 IST