ఐదు రోజులపాటు రైలు సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-03-05T05:32:48+05:30 IST

బెంగళూరు నుంచి హొస్పేట్‌ వెళ్లే రైలు సర్వీసుల (06243, 06244)ను శనివారం నుంచి ఐదు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు స్థానిక స్టేషన మాస్టర్‌ డేవిడ్‌ ప్రకటనలో తెలిపారు.

ఐదు రోజులపాటు రైలు సర్వీసుల రద్దు

రాయదుర్గం, మార్చి 4: బెంగళూరు నుంచి హొస్పేట్‌ వెళ్లే రైలు సర్వీసుల (06243, 06244)ను శనివారం నుంచి ఐదు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు స్థానిక స్టేషన మాస్టర్‌ డేవిడ్‌ ప్రకటనలో తెలిపారు. రైల్వే లైన డబ్లింగ్‌ పనులు చేపడుతున్నందున రాయదుర్గం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హొస్పేట వైపు, మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు వైపు వెళ్లు ఈ రైళ్లను 9వ తేదీ వరకు రద్దు చేశారన్నారు. రాత్రి 11.40కు రాయదుర్గం నుంచి బెంగళూరుకు వెళ్లు  రైలు యథావిధిగా నడుస్తుందని స్పష్టం చేశారు.

Read more