ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-04-25T04:16:58+05:30 IST

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
దుప్పలవలసలో గురుకుల ప్రవేశ పరీక్షను పరిశీలిస్తున్న జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మి

ఎచ్చెర్ల/అరసవల్లి, ఏప్రిల్‌ 24: జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలు/ కళాశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 9 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు  2,217 మంది హాజరుకాగా, 411 మంది గైర్హాజయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు  జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షకు  1,673 మంది హాజరుకాగా, 240 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 8 పాఠశాలల్లో ఐదో తరగతిలో 640 సీట్లు, 9 కళాశాలల్లో 800 ఇంటర్‌ ప్రథమ సంవత్సర సీట్లు ఉన్నాయి. ఎచ్చెర్ల, దుప్పలవలస, పెదపాడు, తామరాపల్లి పరీక్ష కేంద్రాలను గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త వై.యశోదలక్ష్మి, ఎచ్చెర్ల ఎంఈవో కారు పున్నయ్య పరిశీలించారు. 

Read more