-
-
Home » Andhra Pradesh » Srikakulam » Bhamini should continue in Srikakulam-NGTS-AndhraPradesh
-
భామినిని శ్రీకాకుళంలోనే కొనసాగించాలి
ABN , First Publish Date - 2022-03-05T05:53:08+05:30 IST
భామినిని శ్రీకాకుళంలోనే కొనసాగించాలి

భామిని: భామినిని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఏపీ ఒడియా ఉపాధ్యాయుల సంఘ నాయకులు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిని కలిసి విన్నవించారు. శుక్రవారం వండువలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు తెలియజేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఒడియా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మైనార్టీ ప్రజలు, నిరుద్యోగులు మన్యం జిల్లాలో భామినిని విలీనం చేస్తే నష్టపోతామన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రపుల్లకుమార్, రాజశేఖర్, సుధాకర్ తదితరులు ఉన్నారు.