రుణాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన

ABN , First Publish Date - 2022-12-07T23:27:19+05:30 IST

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని డీఆర్‌డీఏ పీడీ డా.డీవీ విద్యాసాగర్‌ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట మండలాల ఏపీఎంలు, సీసీలు, ఏసీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 రుణాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌

టెక్కలి: డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని డీఆర్‌డీఏ పీడీ డా.డీవీ విద్యాసాగర్‌ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట మండలాల ఏపీఎంలు, సీసీలు, ఏసీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘ సభ్యులకు జీవనోపాధి నిమిత్తం అందజేసిన వివిధ రుణాలు, యూనిట్లపై సమీక్షించారు. స్ర్తీ నిధి, పెట్టుబడి నిధి, బ్యాంకు లింకేజీ లక్ష్యాలపై చర్చించారు. సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్‌ ఎస్‌.శ్రీరాములు, ఏపీఎంలు జి.నారాయణరావు, సూర్యనారాయణ, గోవింద రాజులు, శ్రీనివాస్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:27:20+05:30 IST