‘వీరగున్నమ్మ’ ఆడియో విడుదల

ABN , First Publish Date - 2022-12-31T00:19:23+05:30 IST

మందస మండలం వీరగున్నమ్మపురం గ్రామంలో శుక్రవారం విప్లవసేనాని విరగున్నమ్మ సినమా ఆడియో, ట్రైలర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించారు. డైరక్టర్‌ గూన అప్పారావు ఆధ్వర్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు.

‘వీరగున్నమ్మ’ ఆడియో విడుదల
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

హరిపురం: మందస మండలం వీరగున్నమ్మపురం గ్రామంలో శుక్రవారం విప్లవసేనాని విరగున్నమ్మ సినమా ఆడియో, ట్రైలర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించారు. డైరక్టర్‌ గూన అప్పారావు ఆధ్వర్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు. మందస జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ శరత్‌బాబు మొదటి ఆడియో క్యాసెట్టును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వీరనారి సాసుమాను గున్నమ్మ బ్రిటీష్‌ సైనికులను ఎదురించి, జమిందారి వ్యవస్థపై పోరుసల్పి తుపాకీ తూటాలకు బలైన ఆమె చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కర్రి గోపాలకృష్ణ, ఎంపీపీ దానయ్య, జడ్పీటీసీ చంద్రమ్మ, దుంపల లింగరాజు, నటులు చలపతిరావు, గుంట కోదండరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:19:23+05:30 IST

Read more