వ్యక్తిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-12-16T23:22:25+05:30 IST

ఉపాధి పనుల అంశం చిచ్చురేపింది. ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కవిటి మండలం గొర్లెపాడులో శుక్రవారం చోటు చేసుకుంది.

వ్యక్తిపై కత్తితో దాడి
వివరాలు సేకరిస్తున్న పోలీసులు

కవిటి: ఉపాధి పనుల అంశం చిచ్చురేపింది. ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కవిటి మండలం గొర్లెపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి పనుల కే టాయింపు విషయంలో ఆ గ్రామా నికి చెందిన కర్రి హరిబందు, రం జిత్‌ రౌలో మధ్య వివాదం నెలకొంది. గ్రామంలో చెరువులన్నీ రౌలో కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని, ఉపాధి పనులకు కేటాయిస్తే అందరం చేసుకోవచ్చని తొలుత హరిబందు అన్నారు. దీంతో రంజిత్‌ రౌలోతో పాటు మరో ఇద్దరు కత్తితో హరిబందుపై దాడి చేసి గాయ పర్చారు. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఇచ్ఛాఫురం సీహెచ్‌సీకి తరలిం చారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్ఛాపురం పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-16T23:22:32+05:30 IST