జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌ మృతి

ABN , First Publish Date - 2022-11-23T00:10:23+05:30 IST

రామచంద్రాపురం పంచాయతీ అంబటివానిపేటకు చెందిన ఆర్మీ హవల్దార్‌ వెలమల అప్పన్న (39) జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందినట్టు అప్పన్న కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు మంగళవారం సమాచారం అందించారు. మృతదేహం మంగళవారం అర్ధరాత్రికి చేరుకుంటుందని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌ మృతి

గార, నవంబరు 22: రామచంద్రాపురం పంచాయతీ అంబటివానిపేటకు చెందిన ఆర్మీ హవల్దార్‌ వెలమల అప్పన్న (39) జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందినట్టు అప్పన్న కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు మంగళవారం సమాచారం అందించారు. మృతదేహం మంగళవారం అర్ధరాత్రికి చేరుకుంటుందని తెలిపారు. మరో ఏడాదిలో పదవీవిరమణ చేయనున్న అప్పన్న మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.

Updated Date - 2022-11-23T00:10:29+05:30 IST